ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు.
ప్రస్తుతం భూగోళం పర్యావరణ సంక్షోబాన్ని ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్తున్నామని ఆయన వాపోయారు. ఈ విధమైన దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలమని మంత్రి ఆన్నారు.
భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జీవ వైవిధ్యంతో కూడిన ఆకుపచ్చని తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.