Home / SLIDER / కరోనా పోరులో ముందుండి సేవలందించిన ప్రతి ఒక్కళ్ళు యోధులే-TRS పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి

కరోనా పోరులో ముందుండి సేవలందించిన ప్రతి ఒక్కళ్ళు యోధులే-TRS పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి

కరోనా పోరులో ముందుండి సేవలందించిన ప్రతి ఒక్కళ్ళు యోధులేనని TRS పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి అన్నారు.శనివారం ఆరాం ఘర్ X రోడ్డు వద్ద పరివార్ ధాబా లోని బ్యాన్క్వెట్ హాల్ లో జరిగిన ఫార్మసీ రంగానికి చెందిన కోవిడ్ వారియర్స్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి వారిని సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో పనిచేసే వారు , ఫార్మసీ రంగానికి చెందిన వారు గడచిన సంవత్సర కాలంగా అహర్నిశలూ శ్రమిస్తూ ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేస్తున్నారని.
అటువంటి వారిని గౌరవించుకోవడం మనందరి కర్తవ్యం అన్నారు.

ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించిన మన్నాన్ ఖాన్ నిజంగా అభినందనీయుడన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవ్ కుమార్ , అబ్దుల్ రెహ్మాన్ , హాషిం అలీ ,సైఫుల్లా ఖాన్ , ఫరా సిద్ధికీ తదితరులు పాల్గొన్నారు