తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం మాదన్నపేట,వంగపల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరడం జరిగింది.గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరినవారిలో మాదన్నపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొత్తకండ రాజేందర్,వార్డు మెంబర్లు ఎండి షేక్,దుబ్బాకుల సారంగపాని,వంగపల్లి గ్రామ అధ్యక్షులు చిలువేరు జగదీష్,మండల నాయకులు జూపాక ఉపేందర్, ఆకునూరి పైడయ్యా, మేకల రాజు,ఇమ్మడి కుమారస్వామి,చిలువేరు మనోహర్,అంకిల్ల నరేష్,ఎలుకటి మొగిలి, ఇమ్మడి వెంకటస్వామి,రామంచ శంకర్,ఎలుకటి సారయ్యలతో పాటు తదితరులు చేరారు.