Home / SLIDER / యుద్ధ ప్రాతిపదికన సిందోల్‌ రోడ్డు పనులు

యుద్ధ ప్రాతిపదికన సిందోల్‌ రోడ్డు పనులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల లోపు రోడ్డు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పంచాయతీరాజ్ ఎస్ఈని ఆదేశించారు.

కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినా రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని ఆపలేదన్నారు.వానకాలం రైతుబంధు కింద ఈ రోజు వరకు 7 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు వారి ఖాతాలో జమ చేసామన్నారు. 57 లక్షల 60 వేల 608 మంది రైతులకు రూ.6,012 కోట్ల 72 లక్షలు రైతుల ఖాతాలలో జమ చేసినట్లు తెలిపారు.