సినీ ప్రేక్షకులు కొన్నేళ్ల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ, కరోనా వలన వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా నడుస్తుంది. ఎన్టీఆర్ – చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి తాజాగా అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోందని.. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని వెల్లడించారు.అలానే 2 భాషలకు సంబంధించి రామ్ చరణ్- ఎన్టీఆర్ డబ్బింగ్ పూర్తి చేసారని.. మిగిలిన వాటిని కూడా త్వరలోనే ముగిస్తారని మేకర్స్ ప్రకటించారు.
పనిలో పనిగా మూవీ నుండి ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో ఇద్దరు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కొమురం భీమ్ నవ్వుతూ బైక్ డ్రైవ్ చేస్తుండగా.. వెనుక కూర్చున్న అల్లూరి సీతారామరాజు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 13న మూవీని విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.