తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్) ఆధ్వర్యం లో ప్రతీ సంవత్సరం ఘనంగా బోనాల జాతరను, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో మన సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్పేలా వైభవంగా నిర్వహించుకుంటామని, కానీ గత సంవత్సర కాలంగా కరోనా – కోవిడ్ పరిస్థితుల్లో అందరూ సంబరాలకు దూరంగా ఉంటూ సంస్థగా సమాజానికి వీలైనంత సేవ చేస్తూన్నామని అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు.బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రజలంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నామని, నేడు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం మనందరికీ తెలుసునని , టాక్ కార్యవర్గ సభ్యులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్థానిక గుడి లో అమ్మవారికి బోనాలను సమర్పించి అందరినీ చల్లగా చూడాలని, కరోనా నుండి ప్రజలని రక్షించాలని కోరుకున్నామని ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి తెలిపారు.
అలాగే ప్రభుత్వాలుగా ఎన్ని నిబంధనలు చర్యలు తీసుకున్నా, ప్రజలుగా మనమందరం స్వీయ క్రమశిక్షణ పాటించాలని టాక్ సంస్థ నుండి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని,ఈ కార్యక్రమం లో పాల్గొని బోనాలు సమర్పించిన ప్రతి టాక్ సంస్థ ఆడబిడ్డలందరికి శుష్మణ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.చిన్న పిల్లలు టాక్ జెండాలతో , అమ్మవారి నినాదాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ప్రతి సంవత్సరం బోనాల పండగ నాడు బోనం సమర్పించి తొట్టెల ఊరేగింపు, అమ్మ వారి పూజ మనకు ముఖ్య ఘట్టాలని .కరోనా నిబంధనల నేపధ్యం లో సామూహికంగా పూజా కార్యక్రమం నిరవహించే అవకాశం లేనందున , టాక్ తరపున ముఖ్య నాయకులు సురేష్ బుడుగం – స్వాతి దంపతులు వారి ఇంట్లో సంప్రదాయబద్దంగా అమ్మ వారి పూజ నిర్వహించి ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి అందరినీ కాపాడాలని భక్తి శ్రద్దలతో పూజ చేయడం జరిగిందని తెలిపారు.
టాక్ సంస్థ నుండి సురేష్ – స్వాతి దంపతులకు కృతఙ్ఞతలు తెలియజేసారు.టాక్ సంస్థ ఆవిర్భావం నుండి ప్రత్యేక శ్రద్ధతో సంస్థను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల గారికి టాక్ నాయకుడు నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.చివరిగా టాక్ సభ్యులంతా ప్రజలు స్వీయ నియంత్రణ తో పాటు ప్రభుత్వ నిబంధనలు
పాటించాలని కోరారు, అలాగే అమ్మవారు ప్రజలందరినీ రక్షించాలని ప్రార్థించారు.ఇండియా నుండి వచ్చిన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతికి లండన్ లో టాక్ చేస్తున్న సేవలను అభినందించారు.బోనాల సంబరాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టాక్ సభ్యులు లండన్ వాసులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షురాలు శుష్మునా రెడ్డి,మల్లారెడ్డి,నవీన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,స్వాతి , సుప్రజ,సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ ,హరిగౌడ్ ,గణేష్, రవి రెటినేని, , రవి పులుసు,మాధవ్ రెడ్డి ,వంశీ వందన్ , భూషణ్, అవినాష్,వంశీ కృష్ణ ,పృథ్వి ,శ్రీ లక్ష్మి, విజిత,క్రాంతి , భరత్ ,వంశీ పొన్నం , చింటూ ,రమ్య , స్వప్న,లాస్య, పూజిత ,బిందు ,మాధవి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.