ఒక పక్కఅందం,మరోపక్క అభినయంతో దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంటుంది.
ఇటీవల తాను ప్రేమ వ్యవహారంలో ఫెయిల్ అయ్యానని చెప్పిన ఈ అమ్మడు ..ఇప్పుడు ఓ అలవాటుకి బానిసగా మారానుంటూ చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది. ఇంతకీ సొగసరి దేనికి బానిసైందనే కదా..
అసలు విషయంలోకి వెళితే, గిబ్బరిష్ గేమ్‌ను తాను బానిసగా మారానని అనుపమ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. ఈ గేమ్ విషయానికి వస్తే ఇందులో కొన్ని విచిత్రమైన పదాలు కనిపిస్తాయి. మనం పలికే తీరును బట్టి వాటిని మనం కనిపెట్టేయవచ్చు. మరి అలవాటు నుంచి అనుపమ ఎలా బయటపడుతుందో చూడాలి.