కంచె సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మంచి బ్రేక్ అందుకుంది జబల్పూల్ సుందరి ప్రగ్యాజైశ్వాల్. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు. అప్ డేటెడ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ప్రతీ రోజూ కొత్తగా కనిపిస్తూ సందడి చేస్తుంది.
ప్రగ్యాజైశ్వాల్ మెరూన్ కలర్ అవుట్పిట్ లో అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. సాగరతీరంలో బాల్కనీపై స్టన్నింగ్ లుక్లో డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ గా ప్రగ్యాజైశ్వాల్ దిగిన ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా..గ్లామరస్ స్టిల్స్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి.
ఈ బ్యూటీ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమాలో నటిస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. మరోవైపు ప్రగ్యా హిందీలో అంతిమ్ మూవీ చేస్తుండగా ప్రొడక్షన్ దశలో ఉంది. తెలుగు, హిందీతోపాటు కురుక్షేత్ర చిత్రంతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది ప్రగ్యాజైశ్వాల్.