Home / MOVIES / మంచి జోష్ లో ఉన్న రష్మిక మందన్న

మంచి జోష్ లో ఉన్న రష్మిక మందన్న

అందాల రాక్షసి.. యువతరం అభిమాన నాయక రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్‌లో ‘గుడ్‌బై’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకొని హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్నది.

తెలుగులో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. తాను ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది. శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా వినోదానికి పెద్దపీట వేస్తూ రూపొందించబోతున్నారు.