Home / SLIDER / మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరుదైన కానుక

మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరుదైన కానుక

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి భవన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిశారు.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ,శోభమ్మ ఉన్న పంచలోహ చిత్రపటాన్ని మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కుమార్తెలు శ్రీహిత,శ్రీహర్శిత లతో కల్సి బహుకరించారు. ఈ చిత్రపటాన్ని ప్రముఖ శిల్పులు దాదాపు మూడేండ్ల పాలు కృషి రూపొందించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రి కేటీఆర్ కు వివరించారు.