Home / Uncategorized / సంక్రాంతికి పవన్ కొత్త మూవీ

సంక్రాంతికి పవన్ కొత్త మూవీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే.

ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్రం యూనిట్ విడుదల చేసిన ఈ మూవీ మేకింగ్ వీడియోలో తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

ఇందులో పోలీసు అధికారి పాత్రలో పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ గా కన్పించనున్నట్లు తెలుస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ ట్రైన్మెంట్ సంస్థ నిర్మాణ సారధ్యంలో తమన్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలను అందిస్తున్నారు.