ఏ తండ్రికి అయిన తన కుమారుడు పెరిగి పెద్దయి ప్రయోజకుడు అయితే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన తన కొడుకు ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటారు. తండ్రి కలని కుమారులు నిజం చేస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కమెడీయన్ కొడుకు సబ్ కలెక్టర్గా నియామకం కావడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు.
తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హసన్, విజయ్ కాంత్, కార్తీక్, అజిత్ వంటి పెద్ద హీరోల సినిమాలలో నటించిన కమెడీయన్ చిన్ని జయంత్. ఇప్పుడు ఈయనే పేరు సోషల్ మీడియా మారుమ్రోగిపోతుంది. అందుకు కారణంగా తన కొడుకు సాధించిన ఘనతనే. చిన్ని జయంత్ కుమారుడు శృతన్ జై నారాయణన్ 2020లో ఐఏఎస్ పూర్తి చేశాడు.
ఆలిండియా లెవల్లో 75వ ర్యాంకు సంపాదించిన అతడు తాజాగా ట్యుటికోరన్ జిల్లాకు సబ్ కలెక్టర్గా నియామకమయ్యాడు. శృతన్.. విద్య, జీవనోపాధి, మహిళా సాధికారత పెరుగుదలకు తన వంతు కృషి చేస్తానంటున్నాడు. కొడుకుని సబ్ కలెక్టర్గా చూసి తండ్రి తెగ మురిసిపోతున్నాడు.