తీన్మార్ మల్లన్నపై ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. క్రైం నంబర్ 197/2021లో ఐపీసీ సెక్షన్ 387, 504 కింద కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆయనకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురంలోని ఇంటినంబర్ 2-79కు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల ప్రకారం పోలీసుల ముందు హాజరు కాకపోతే సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ(3),(4) కింద అరెస్టు చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు.
పలు కేసులు
- తీన్మార్ మల్లన్న గతంలో ఒక చానల్లో పని చేస్తున్నపుడు అద్దెకు ఉండే ఇంటి ఓనర్‌పై లైంగిక దాడి చేయబోయాడు. దీంతో ఆ యాజమాని బంధువులు మల్లన్నను చితకబాది ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
- తీన్మార్ మల్లన్న తన భార్య పేరుతో చిట్స్ నడిపి 76 మంది అమాయక మహిళలను మోసం చేసి రూ.3 కోట్లతో పారిపోయి ఏపీలోని మంగళగిరి దగ్గర ఒక గ్రామంలో తలదాచుకుంటే టాస్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి మూడు నెలలు జైలుకు పంపించారు.
- మల్లన్న బంధువు ఒకరు ఇద్దరు మహిళలను తప్పుడు పత్రాలతో దుబాయ్‌కి పంపిస్తుంటే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు.
- ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు డబ్బుల కోసం ఓ బ్యాంకు ఉద్యోగి భూమిని తప్పుడు పత్రాలతో ఏపీకి చెందిన మాజీ మంత్రికి తనఖా పెట్టాడు. ఆ కేసు సిటీ సివిల్ కోర్టులో నడుస్తున్నది.
- పార్టీ పెట్టడానికి ముందే తన టీంలో దీర్ఘకాలిక రోగాలున్న కొందరికి భారీగా డబ్బిచ్చి ఆత్మహత్య చేసుకోవాలని ఉసిగొల్పాడని, తెలంగాణవాదాన్ని రెచ్చగొట్టి తాను పెట్టబోయే పార్టీకి సానుభూతి పొందాలని కుట్ర చేస్తున్నాడని ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.