Home / SLIDER / తీన్మార్‌ మల్లన్న కేసు- ఆ “యువతి” ఎవరు..?

తీన్మార్‌ మల్లన్న కేసు- ఆ “యువతి” ఎవరు..?

 చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకు సోదాలు నిర్వహించారు.

కంప్యూటర్లను, హార్డ్‌ డిస్క్‌లను సీజ్‌ చేశారు. తీన్మార్‌ మల్లన్నపై సోమవారం ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారని అంటున్నారు.

దాంతోపాటు చిలకలగూడ పోలీ‌స్‌స్టేషన్‌లో తీన్మార్‌ మల్లన్నపై నమోదైన మరో కేసు దర్యాప్తులో భాగంగా  అక్కడి పోలీసులు సైతం 41ఏ నోటీసు అందజేశారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని, బాధితులు, సాక్షులను ప్రభావితం చేయొద్దని నోటీసులో పేర్కొన్నారు.