హైదరాబాద్ మహానగరంలోని ఫతేనగర్‌లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్లతో 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
