ప్రముఖ యాంకర్, నటి గాయత్రి భార్గవి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్అయింది. దీంతో వెంటనే ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేసి అభ్యంతరకర సన్నివేశాలు పోస్టులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్నేహితులు, కుటుంబ సభ్యులు కాస్త ఎలర్ట్‌గా ఉండండి. నా అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దు. ఇన్‌స్టాగ్రామ్ సేఫ్‌గా ఉంది. దానితో నాతో టచ్‌లో ఉండొచ్చు.
ఈ కేస్ క్లియర్ అయ్యాక నేనే ఓక వీడియో పోస్ట్ చేస్తా. అప్పటి వరకూ నా ఫేస్‌బుక్ ఖాతా గురించి పట్టించుకోవద్దు’’ అని భార్గవి తెలిపారు. యాంకర్ భార్గవి ఎఫ్‌బీ అఫీషియల్ అకౌంట్‌తో పాటు మరో అకౌంట్‌ను దుండగుడు ఆమె పేరు మీద క్రియేట్ చేసినట్లు గుర్తించామని ఏసీపీ కె. వి. ఎం. ప్రసాద్ తెలిపారు.