ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని కొందరు మహిళలు తన దృష్టికి తెచ్చారని, ఇప్పుడు పట్టణ ప్రాంతంలోని మహిళా సంఘాలకు కూడా ఈ అవకాశాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, ప్రతి గ్రామంలో సీసీ ప్లాట్‌ఫాంలు, మినీ గోడౌన్లు నిర్మిస్తామని చెప్పారు.
అభయహస్తం పథకంపై ఇటీవలనే రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించిందని, ఎల్‌ఐసీ వద్ద ఉన్న ఈ పథకం నిధులను వడ్డీతో సహా సంబంధిత మహిళలకు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ పరిష్కరించే బాధ్యత తమదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జడ్పీటీసీ సభ్యులు బక్కారెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌషిక్ రెడ్డి, డీఆర్‌డీఓ ఎల్ శ్రీలతారెడ్డి, మెప్మాపీడీ రవీందర్ పాల్గొన్నారు.