సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో కేటీఆర్ ఒకరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిత్యం నిమగ్నమయ్యే మంత్రి కేటీఆర్.. ఎవరికీ ఏ ఆపదొచ్చినా క్షణాల్లో స్పందించి, ఆదుకునే గొప్ప నాయకుడు కేటీఆర్. ఎల్లప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. 30 లక్షల మార్క్‌ను చేరుకున్నారు. అంటే ట్విట్టర్‌లో కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు 30 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తన ట్విట్టర్ పేజీ వేదికగా వెల్లడిస్తూ.. కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందల వర్షం కురిపించారు. ఏడాది కాలంలోనే కేటీఆర్ 10 లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు.
కరోనా బారిన పడ్డ వారు సహాయం కావాలని కోరుతూ కేటీఆర్‌కు ట్వీట్ చేసిన సందర్భాలు అనేకం. అలా చేసిన ప్రతి ట్వీట్‌కు కేటీఆర్ స్పందించి.. సహాయం అందించారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించారు. లాక్‌డౌన్‌లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలనుకున్న నిస్సహాయులకు వాహనాలు సమకూర్చి గొప్ప మనసును చాటుకున్నారు కేటీఆర్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఐదేండ్ల ఓ చిన్నారి హార్ట్ సర్జరీకి ఆర్థికం సాయం కోరుతూ బుధవారం ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. కేటీఆర్ తక్షణమే స్పందించారు. ఆ చిన్నారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం.. తమ ఆఫీసును సంప్రదించండి అని కేటీఆర్ రీట్వీట్ చేశారు.
ఇక అంతే కాదు.. అప్పుడప్పుడూ ప్రజా సమస్యలు, ప్రభుత్వ పాలనపై ట్విట్టర్ వేదికగా ఆస్క్ కేటీఆర్ అనే ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతి సమస్యకు పరిష్కారం చెబుతూ.. ప్రతి అంశానికి తనదైన శైలిలో నెటిజన్లకు సమాధానం ఇస్తుంటారు. గొప్ప వక్త అయిన కేటీఆర్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషలో మంచి నిష్ణాతులు.