Home / MOVIES / KBC: కేబీసీలో ప్ర‌శ్న‌గా మంత్రి కేటీఆర్ ట్వీట్‌..

KBC: కేబీసీలో ప్ర‌శ్న‌గా మంత్రి కేటీఆర్ ట్వీట్‌..

కొన్ని సంవ‌త్స‌రాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకి సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు ఎంద‌రో హాజ‌ర‌య్యారు. తాజాగా భార‌త మాజీ క్రికెట‌ర్స్ వీరేంద్ర సెహ్వాగ్‌, సౌర‌వ్ గంగూలీ హాజ‌ర‌య్యారు. వీరికి అమితాబ్‌.. కేటీఆర్ గ‌తంలో చేసిన ట్వీట్‌ని ప్ర‌శ్న‌గా అడిగారు.

గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన ట్వీట్టర్ ఖాతాలో రెండు మెడిసిన్ పదాలు రాసి వీటిని సరిగ్గా పలికే వారు ఉన్నారా ? అనే విధంగా ట్వీట్ చేశారు. వాటికి శ‌శి ధ‌రూర్ అయితే స‌రిగ్గా స‌మాధానం చెప్ప‌గ‌ర‌ని చెబుతూ ఆయ‌న‌ని ట్యాగ్ చేశారు.ఇప్పుడు ఆ ట్వీట్ కేబీలో ప్ర‌శ్నగా మారింది.

నోరు తిరగని కోవిడ్ 19 మెడిసిన్ లిస్ట్‏ను తెలంగాణ మంత్రి కేటీఆర్ వీరిలో ఎవరికి ట్యాగ్ చేశారంటూ ప్రశ్నిస్తూ.. నాలుగురి పేర్లను ఆప్షన్స్‏గా ఇచ్చారు అమితాబ్ . అందులో ఒకరు కపిలి సిబల్, సుబ్రమణ్యన్ స్వామి, అమితావ్ గోష్, శశిథరూర్ అనే ఆప్షన్స్ ఇచ్చారు. దీనిపై సౌర‌వ్ తెలివిగా శ‌శి థ‌రూర్ అని చెప్పారు.ఆయ‌న‌కు ఇంగ్లీష్‌పై ప‌ట్టు బాగా ఉంటుంది. అందుకే ఆయ‌న పేరు గెస్ చేసి చెప్పాను అని సౌర‌వ్ అన్నారు.

అయితే త‌ను చేసిన ట్వీట్ కేబీసీ తాజా ఎపిసోడ్‌లో ప్ర‌శ్న‌గా రావడంతో కేటీఆర్ ఆశ్చ‌ర్య‌పోయారు.ఏదో స‌ర‌దగా చేసిన ట్వీట్ ఇలా కేబీసీలో రావ‌డం సతోషంగా ఉంది. దాదా, సెహ్వాగ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారని అనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. దీంతో కేటీఆర్ ట్వీట్ తెగ వైరల్‌గా మారింది.