Home / NATIONAL / దేశంలో కొత్తగా 42వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 42వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 45 వేలకుపైగా నమోదవగా, తాజాగా అవి 42 వేలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 3.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58 లక్ష మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపింది.

దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,45,907కు చేరింది. ఇందులో 3,21,00,001 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,05,681 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మరో 4,40,225 మంది బాధితులు మరణించారు. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 36,385 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 330 మంది మృతిచెందారని ఆరోగ్యశాఖ తెలిపింది.