బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్‌కి సిద్ధమైంది. నేటి నుండి ఐదో సీజన్ ప్రసారం కానుండగా, ఇన్నాళ్లు ఈ కార్యక్రమానికి సంబంధించిన వస్తున్న వార్తలకు ఈ రోజుతో బ్రేక్ పడనుంది. ఈ రోజు సాయంత్రం 6గం.లకు లాంచింగ్ కార్యక్రమం ప్రసారం కానుండగా, దీనికి సంబంధించిన షూట్ నిన్ననే పూర్తైంది.
తాజాగా మేకర్స్ సీజన్ 5కి సంబంధించి కొత్త ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోతో రచ్చ ఐదింతలు ఉంటుందని చెప్తున్నారు. ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ ఉంటాయని చెప్పుకొచ్చారు. అలానే కిక్ ఈసారి టన్నుల్లో ఉంటుందని చెప్పడంతో అంచనాలు భారీగా పెరిగాయి. బయట నుండి బిగ్ బాస్ హౌజ్ కూడా చూపించి ఆసక్తి రేకెత్తించారు. మరి కొద్దిగంటలలో ప్రసారం కానున్న సీజన్ 5 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.