Home / HYDERBAAD / హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన  హైదరాబాద్‌లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్‌ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.

రేపటి నుంచి రాత్రి వేళల్లో 10.15 గంటలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు.

ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సమయాలను పొడిగించినట్లు వెల్లడించారు. కాగా, ఎప్పటిలాగానే ఉదయం 7 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి రోజు మూడు మార్గాల్లో వెయ్యి ట్రిప్పులు తిప్పుతున్నామని చెప్పారు.