వేల చేతులు, లక్షల ఆలోచనలతో సురవరం పనిచేశారు.తెలంగాణ సమాజం మీద ఆయన తనదైన ముద్ర వేశారు.దీనజనోద్దరణ, సమాజ అభ్యున్నతి కోసం సురవరం చిరకాలం కృషిచేశారు.దాదాపు 80 ఏళ్ల క్రితమే దళితుల దండోరా పేరుతో సామూహిక భోజనాలు ఏర్పాటు చేసిన చైతన్యశీలి సురవరం ప్రతాపరెడ్డి గారు.
ఒక వ్యక్తి బహుముఖంగా పనిచేయడం చరిత్రలో అరుదుగా కనిపిస్తుంది అలాంటి అరుదయిన వ్యక్తి ప్రతాపరెడ్డి గారు.గత ఏడాది సెప్టెంబరు 9న సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు మీద వనపర్తిలో పార్కు, అందులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం జరిగింది.2018లో తీసుకువచ్చిన జల కవితోత్సవం పుస్తకం మీద సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ పరిశోధనకు ఎంచుకున్నారు.1995 సురవరం ప్రతాపరెడ్డి గారి శత జయంతి .. అప్పటికి కొందరు సాహితీవేత్తలు, ప్రముఖులకే ఈ విషయం తెలుసు.వనపర్తిలో ప్రముఖ కవులు, రచయితలు, సాహిత్యాభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో చర్చించి వనపర్తి గ్రంథాలయానికి సురవరం గారి పేరు పెట్టి పునరుద్దరించాలని నిర్ణయించడం జరిగింది.ప్రస్తుతం సురవరం అనంతరం తెలంగాణ సమాజ పరిణామాలు అంశాలుగా 2వ సంపుటిని రూపొందించడం జరిగింది
ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సంపాదకత్వంలో ‘సురవరం తెలంగాణ’ 2 వ సంపుటి పుస్తకాన్ని (సురవరం అనంతరం తెలంగాణ సమాజం) ఆవిష్కరించిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు, హాజరైన ముఖ్య అతిథి బుర్రా వెంకటేశం ఐఎఎస్ గారు, ప్రజాకవి, శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న గారు, ప్రముఖ కవి, రచయిత, సీఎం ఓఎస్డీ గోరటి వెంకన్న గారు, కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి గారు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, ప్రముఖ సాహిత్య, చరిత్ర పరిశోధకులు కుర్రా జితేంద్రబాబు గారు
తదితరులు
అనంతరం 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సీఎం రాజుతో పాటు, అతిధులు, వక్తలు, ఆవిష్కర్తలకు సన్మానం చేయడం జరిగింది
ముఖ్య అతిథి బుర్రా వెంకటేశం గారి వ్యాఖ్యలు
తెలంగాణకు దేవతలు (సురులు) ఇచ్చిన వరం ‘సురవరం’
తెలంగాణ జాతి నిర్మాణం కోసం నిబద్దతతో పనిచేసిన ఇద్దరు మహానుభావులు సురవరం ప్రతాపరెడ్డి గారు, కాళోజీ నారాయణ రావు గార్లు
సురవరం మరణానంతరం 1956 తర్వాత తెలంగాణ అవమానాలు అనుభవించడం మొదలయింది
1953 లో సురవరం గారు చనిపోవడానికి ముందే సమాజ నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున కృషిచేశారు
అదే 1956 తర్వాత వారు, కాళోజీ గారు ఉండి ఉంటే తెలంగాణ సమాజ నిర్మాణం ఏ విధంగా ముందుకు సాగేదో అని అనిపిస్తుంది
సురవరం వంటి వారి చరిత్రను నేటి తరాలకు పరిచయం చేసే పనిని నెత్తికి ఎత్తుకోవడం అభినందనీయం
ప్రపంచంలో 12వ పెద్ద భాష అయిన తెలుగును మనం కాపాడుకోవాలి
ప్రతి ఒక్కరూ తెలుగు రాయడం, చదవడం నేర్చుకుని అది మృతభాష కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది
తల్లి పాలు తాగినప్పుడు విన్న భాష ద్వారానే మన హృదయాలు స్పందిస్తాయి
మన భాషను నిలుపుకుంటే భావం నిలుస్తుంది .. దాంతో జాతి నిర్మాణమవుతుంది
సురవరం, కాళోజీలు తండ్లాడింది దాని కోసమే
మూలాలు మరిచిపోతే మనుగడ ఉండదు .. భాష వ్యాప్తి, భావ వ్యాప్తిని కొనసాగించాలి
గోరటి వెంకన్న గారి వ్యాఖ్యలు
సాహిత్యం, రాజకీయం ఒకే ఒరలో ఇముడలేవని అంటారు
ఇందులో ఒకటి కత్తి, మరొకటి పుష్పం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఆ రెండింటినీ ఇముడ్చుకున్న అరుదయిన రాజకీయ నాయకులు
సాహిత్యరంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన అరుదయిన మనిషి సురవరం ప్రతాప్ రెడ్డి గారు
అన్ని సంస్కారాలకన్నా సాహిత్య సంస్కారం ఉన్నతమయినది
రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, అర్థిక మార్పుల గురించి సంచికను తీసుకువచ్చినందుకు అభినందనలు
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారి వ్యాఖ్యలు
సురవరం ప్రతాపరెడ్డి మరణానంతరం రెండు దశాబ్దాల పాటు వారిని విస్మరించారు
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి గుర్తు చేసుకోవడం జరిగింది
సురవరం గారి ఔన్నత్యాన్ని సమాజానికి తెలియజెప్పే బాధ్యతను స్వీకరించిన మంత్రి నిరంజన్ రెడ్డి గారు అభినందనీయులు
ప్రతాపరెడ్డి అంతటి విద్యావేత్తను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వకుండా విస్మరించారు
రామాయణ విశేషాలు, ఆంధ్రుల సాంఘీక చరిత్ర, పుస్తకాలు సురవరం కీర్తిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి
వనపర్తిని సాహిత్య కృషిలో మంత్రి మళ్లీ ముందు వరసలో నిలబెట్టారు
ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ గారి వ్యాఖ్యలు
వ్యవసాయంతో రాష్ట్రాన్ని పచ్చగా ఉంచడంతో పాటు సాహిత్యాన్ని కూడా పచ్చగా ఉంచుతున్న వారు మంత్రి నిరంజన్ రెడ్డి గారు
నిద్రాణమై ఉన్న తెలంగాణను మేలుకొలిపిన మహానుభావుడు సురవరం
ఆంధ్రాలో నలుగురైదుగురు కవులు చేసిన పనిని తెలంగాణలో ఒక్కడిగా సురవరం చేశారు
సంస్కృతభాష నేర్చుకునేందుకు గురువు ఆదేశం మేరకు మాంసాహారాన్ని వదిలేసి జీవితాంతం ముట్టుకోని నిబద్దత కలిగిన వ్యక్తి సురవరం
తెలంగాణ సమాజ వికాసానికి దుర్భర అరణ్యాన్ని నరికి రహదారులు నిర్మించి ముందుకు తీసుకెళ్లిన మహాత్ముడు సురవరం
గోలకొండ కవుల సంచికలో సమాజంలోని అన్ని వర్గాల కవుల రచనలు ఉండేలా చూసిన వ్యక్తి సురవరం గారు
ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో గ్రామాలలో తిరిగి కవులను గుర్తించి రచనలు సేకరించి ప్రచురించిన వారు సురవరం
తెలంగాణ సమాజ పరివర్తన కోసం అత్యంత నిబద్దతతో వారు కృషిచేశారు
సాహిత్యకృషి, సాంఘీక కృషి ఏకకాలంలో చేసిన నేత
ప్రతాపరెడ్డి గారు వేసిన పాదులు, సాళ్ల నుండి నడిచి వచ్చిన వారే దాశరధి, కాళోజీ నారాయణరావు గార్లు
తెలంగాణ ఉద్యమం అనంతరం తెలంగాణ సమాజం ఎంతో చైతన్యంగా పనిచేస్తుంది
అనేక మంది స్థానిక చరిత్రను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు
ప్రముఖ చరిత్ర పరిశోధకులు కుర్రా జితేంద్రబాబు గారు
దేశానికి నాగలిని అందించిన ప్రాంతం పాలమూరు జిల్లా
దక్షిణ భారత దేశానికి వ్యవసాయ నాగరికతను నేర్పుతున్న ప్రాంతం
సురవరం ప్రతాపరెడ్డితో సాన్నిహిత్యం పెంచుకుని మాడపాటి హనుమంతరావు గారు వారిని రాజకీయాల వైపు, సాహిత్య ఉద్యమాల వైపు మళ్లించారు
అందరూ విస్మరించిన సురవరం గారిని నిరంజన్ రెడ్డి గారు తెరమీదకు తెచ్చి రెండు సంకలనాల ద్వారా తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తున్నారు
భవిష్యత్ తరాలకు ఇవి ఎన్ సైక్లోపీడియాగా ఉపయోగపడతాయి
ఎక్కడా కవిపించని ప్రముఖ కవుల రచనలు సేకరించి సంకలనం చేసి భవిష్యత్ తరాలకు అందించడం అభినందనీయం
ఈ సంచికలను ఎక్కువ మందికి చేరవేయడం ద్వారా మన చరిత్ర వైభవాన్ని పునశ్చరణ చేసుకోగలుగుతాం
మామిడి హరికృష్ణ గారి వ్యాఖ్యలు
తెలుగుజాతి వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి గారు
తెలంగాణ అస్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన మహోన్నతమూర్తి .. కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవం పొందిన గొప్ప వ్యక్తి
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకరాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమంలో కేసుల్లో చిక్కుకున్న ఉద్యమకారుల పక్షాన నిలబడి తపించిన వారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
కేసీఆర్ మార్గదర్శకత్వంలో నీళ్ల నిరంజన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు
సాహితీవేత్తలకు చేదోడు, వాదోడుగా నిలబడి స్ఫూర్థినిస్తున్నారు
సురవరం తెలంగాణ సంచికలు మరిన్ని సంచికలు రావడానికి దారి దీపంగా నిలుస్తాయి
కాళోజీ అవార్డ్ గ్రహీత కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి గారి వ్యాఖ్యలు
తెలంగాణ సాహిత్యాన్ని వెయ్యి చేతులతో రాసిన వారు సురవరం ప్రతాపరెడ్డి గారు
వారి కృషిని వెయ్యి నాలుకలతో కీర్తించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది
తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతున్నది
జల కవితోత్సవంతో మొదలై మన సినారె, సురవరం తెలంగాణ మొదటి సంచికతో పాటు నేడు రెండవ సంచిక తీసుకురావడం జరిగింది.