Home / SLIDER /  హుజురాబాద్‌లో కాంగ్రెస్ లేనే లేదు

 హుజురాబాద్‌లో కాంగ్రెస్ లేనే లేదు

 హుజురాబాద్‌లో కాంగ్రెస్ లేనే లేదని మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ దేశంలోని బీజేపీ పాలిత 18 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఇస్తేనే హుజురాబాద్‌లో రాష్ట్ర బీజేపీ నేతలు ఓటు అడగాలన్నారు.

బీజేపీ నేతలు మాయ మాటలు చెప్తున్నారని, వారి మాటలు నమ్మవద్దన్నారు. ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌కు మధ్యనే పోటీ అన్నారు. ప్రజలు ఓటు వేసేందుకు వెళ్తున్నప్పుడు సిలిండర్‌కు దండం పెట్టండని మంత్రి హరీష్‌రావు అన్నారు