ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ జంటగా అనుభూతి కశ్యప్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డాక్టర్ జీ’. ఈ చిత్రంలో ఫాతిమా అనే మెడికో పాత్రలో రకుల్ నటిస్తోంది. సినిమా కోసం డాక్టర్ల మేనరిజమ్స్ ఫాలో అయ్యానని పలువిషయాలు చెప్పుకొచ్చింది..
ఈ బ్యూటీ. ‘డాక్టర్ కోటు ధరించగానే చాలా బాధ్యతగా ఫీలయ్యేదాన్ని. వారి జీవితాలు ఎంత కష్టమో తెలిసింది. ఫాతిమాగా కెమెరా ముందుకెళ్లగానే నేను రకుల్ ప్రీత్ సింగ్ ను కాదు అనిపించేది’ అని రకుల్ చెప్పింది.