తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి తీసుకొచ్చిన పథకం దళిత బంధు పథకాన్ని బీజేపీ కుట్రలు చేసి ఆపిందని అన్నారు జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు బుధవారం జమ్మికుంట మండలంలోని మాచనపల్లి మరియు నాగంపేట దళిత కాలనిలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగయ్య మరియు గాదరి కిషోర్ తో కలిసి పాల్గొన్నారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడ్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని తీసుకుని వస్తే దళితుల మధ్య లేని పోనీ చిచ్చులు పెట్టి బీజేపీ పార్టీ కావాలని ఈ పథకాన్ని ఆపాలని చూస్తుందని మీరు ఈ పది రోజులు దళిత బంధు ఆపినంత మాత్రాన హుజురాబాద్ లో గెలుస్తామని అనుకుంటున్నారు.
కానీ హుజురాబాద్ నియోజకవర్గ దళితులు మీరు చేస్తున్న కుట్రలను చూస్తున్నారని మీకు ఈ నియోజకవర్గ ప్రజల తగిన బుద్ధి చెపుతారని అన్నారు.. ఈ 2 వ తేదీ తర్వాత అందరికి దళితబందు వస్తుందని దీనిపై ఎటువంటి అపోహలు అవసరం లేదని అన్నారు..ఈ కార్యక్రమంలో సర్పంచులు తిరుపతి, కృష్ణ రెడ్డి,ఎంపీటీసీలు రాజయ్య,రాజేశ్వరరావు,వార్డు సభ్యులు, గ్రామ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు