అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తొలి స్థానంలో నిలిచారు. మొత్తం 70% రేటింగ్‌తో మోదీ అగ్ర స్థానం నిలబెట్టుకున్నారు.
మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రెటర్ 66%తో, ఇటలీ ప్రధాని మారియో 58%తో, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ 54%తో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 47%తో, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 44%తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో 43%తో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 40%తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.