రాజకీయాలంటే ఓట్లు,సీట్లు, గెలుపు ఓటములు మాత్రమే కాదు బందాలు,భాందవ్యాలు భాద్యతలు అని మరోమారు నిరూపించారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..గత ఏడాది కరోనా మహమ్మారి బారిన పడి కార్పోరేటర్ కావటి కవిత భర్త రాజుయాదవ్ కన్నుమూసాడు..ఆ రోజు రాజుకు అలా జరగడం చూసి చలించిపోయిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆ కుటుంబానికి అన్నీ తానై అండగా ఉంటాను.కవితకు ఒక అన్నగా,పిల్లలకు మేనమామగా నేనుంటాను అని వారిలో భరోసా నింపారు..చెప్పడం మాత్రమే కాదు నేడు అది చేసి చూపించారు..
రాజు యాదవ్ గారి భార్య కవితకు కార్పోరేటర్ గా అవకాశం ఇచ్చి స్వయంగా దగ్గరుండి తనను గెలిపించారు..నేడు కావటి కవిత రాజుయాదవ్ గారి కుమార్తె వివాహానికి పెళ్ళి పెద్దగా మారి ఆ ఆడభిడ్డకు మేనమామ తానే అయి దగ్గరుండి పెళ్ళిని జరిపించారు..పెళ్ళి వేడుకల ఆరంభం సంగీత్ నుండి మొదలుకుని పెళ్ళి పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే నరేందర్ వాణి దంపతులు ఒక ఎమ్మెల్యే గా కాకుండా ఆ ఇంటి మనిషులుగా మారి వాళ్ళలో ఒకరిగా మేనమామలా ఆ ఆడభిడ్డకు,కవిత గారికి భరోసానిచ్చారు..వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని నింపారు..మేనమామ ఏ భాద్యతనైతే పూర్తి చేస్తారో అంతకు మించి తానే స్యయంగా మేనమామ గా వారికి సహాయసహాకారాలు అందిస్తూ ఆ భాద్యతనంతా పూర్తి చేసారు..
కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వాణి దంపతులు వివాహ వేడుకలో బాగస్వామ్యమై దగ్గరుండి పెళ్ళి జరిపించారు..తను మాట ఇస్తే భాద్యతగా తీసుకుంటే కార్యకర్తలకోసం,నమ్మిన వారికోసం తాను ఎంత గొప్పగా చూసుకుంటారో ఇది నిదర్శనం అని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..పెళ్ళిలో మేనమామగా మారిన ఎమ్మెల్యే ను చూసి పెళ్ళికి వచ్చిన బందుజనం సంతోషం వ్యక్తం చేసారు.ఎంత ఎదిగినా ఒదిగిఉండటం చాలా గొప్ప విషయం అని వారు చర్చించుకుంటున్నారు.కార్యకర్తలు సైతం తమకు ఇలా అండగా నిలిచే నాయకుడు దొరకటం అదృష్టం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
గ్రేట్ ఎమ్మెల్యే నరేందర్ గారూ..