తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇతర ముఖ్యనేతలతో సమావేశమై ఈమేరకు చర్చించినట్లు సమాచారం.
అభ్యర్థులను నిలబెట్టినా పార్టీకి జిల్లాల్లో ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే ఉత్తమమని బీజేపీ భావిస్తోంది. కాగా, మొత్తం 12 స్థానాల్లో డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.