ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ తెలిపారు. ఇటీవల చరణ్ సన్నిహితుల ఇంట్లో ఈడీ దాడులు జరగ్గా.. ‘నిజాయితీ లేని వ్యక్తి’ అని కేజీవాల్ విమర్శించారు. దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కేజీవాల్ వ్యాఖ్యానించారని.. ఆయనపై దావా వేస్తానని చరణ్ జిత్ చెప్పారు. గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేసి.. కేజీవాల్ క్షమాపణలు చెప్పారని చరణ్ పేర్కొన్నారు.
