తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, జడ్చర్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి జన్మదినం (ఫిబ్రవరి 3వ తేదీన) సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గ సర్పంచుల సంఘం గౌరవ రాజ్యసభ ఎంపీ సంతోష్ రావు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ని రాజపూర్ మండల కేంద్రం, మాచారం గ్రామాల్లో మరియు జడ్చర్ల డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి మొక్కలు నాటి కార్యక్రమాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి హరితహారం స్పూర్తితో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతం గా కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక మైన సందర్భాల్లో మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి గారు పిలుపునిచ్చారు. వరుసగా రెండో ఏడాది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పెద్దయెత్తున మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం చేసిన సర్పంచ్ లకు ధన్యవాదాలు తెలిపారు.