రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. 6 రోజుల్లో సుమారు 6000 మంది రష్యన్లు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా దాడుల్లో తమ దేశానికి చెందిన 300 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
అందులో 14 మంది పిల్లలు కూడా ఉన్నారన్నారు. మిసైళ్లు, షెల్లింగ్స్, యుద్ధ ట్యాంకులతో రష్యా విరుచుకుపడుతోంది. దక్షిణ ఉక్రెయిన్లోని ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది.