జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ.శ్రీ.శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం బ్రాహ్మోత్సవాలు (జాతర) మర్చి 14వ తేదీ నుండి మర్చి 26న తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలపై న్యూ టి.టి.డి లో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సమీక్షా నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….దర్మపురి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఇబ్బందులు కలుగకుండా ప్రతిసంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విజయవంతం చేయాలని, ఈసారి జరిగే బ్రహ్మోత్సవాలలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడంలో అధికారులు, పట్టణ యువత ప్రధాన పాత్రను పోషించాలని సూచించారు.బ్యాక్ వాటర్ వలన గోదావరి లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని,రాత్రులు నిద్రచేసే భక్తుల కొరకు ఫంక్షన్ హాల్, సత్రాలు, బ్రాహ్మణ,ఆర్యవైశ్య సంఘాలను వినియోగించుకోవాలని సూచించారు.వేసవికాలం మొదలవుతున్నందున భక్తులకు మంచి నీరు, మినరల్ వాటర్, మజ్జిగ ప్యాకెట్లు, భోజన ఏర్పాట్లు చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చెసి సమస్యను పరిష్కరించాలని, భక్తులకు మంచినీటి సమస్యలు లేకుండా బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు తాత్కాళికంగా ఆర్వో ప్లాంట్ ను వినియోగించుకోవాలని పేర్కోన్నారు.
సేవ చేయాలని స్వచ్చందంగా ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించాలని. శేషప్పకళావేదికపై స్వామి వారి కళ్యాణం జరిగే సమయంలో మంత్రులు, ప్రముఖులు రావడం సెంటిమెంట్ గా ఉందని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోని జాతరను విజయవంతంగా నిర్వహించుకునేలా ప్రతి ఓక్కరు కృషి చేయాలని తెలియజేశారు.విద్యూత్ లైట్లు, పారిశుద్ద్యం సక్రమంగా నిర్వహించడం కొరకు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు సానిటేషన్ సిబ్బందిని నియమించాలని, గత సవంత్సరాల నుండి రైస్ మిల్లుల నిర్వహకులు మరియు వర్తక వ్యాపార సంఘాల వారు అన్నదానం నిర్వహిస్తున్న సందర్బంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి అవసరమైన సహకారాలను అంధించడం జరగుతుందని పేర్కోన్నారు. విద్యూత్ దీపాలతొ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, పనిని సమానంగా పంచుకొని చేయడం ద్వారా ఇంకా బాగా చేయగలుగుతామని అన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, దర్మపురి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లలొ తేదీ.14.3.2022 నుండి తేదీ. 26.3.2022 వరకు జరుగు బ్రహ్మోత్సవాలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సాఫిగా జరిగేలా అన్నిశాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. శాఖల వారిగా చేయవలసిన కార్యక్రమాలను మరింత ఉత్సహంగా, వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కోన్నారు. గతంలో నిర్వహించిన కార్యక్రమం గుర్తించిన లోటుపాట్ల పై అధికారులు సమిష్టిగా చర్చించి తిరిగి పునరావృతం కాకండా నిర్వహించాలని సూచించారు. అనంతరం దేవాలయం బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కర పత్రాలు ఆవిష్కరించారు.జిల్లా ఎస్పి శ్రీమతి సిందుశర్మ, అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, అదనపు ఎస్పీ రూపేష్, ఆర్.డి.ఓ., జగిత్యాల , మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ.రాజేష్, వివిధ శాఖల అధికారులు, జెడ్పిటిసిలు, ఎం.పి.పి. ఎం.పి.టి.సిలు, రైస్ మిల్లర్లు యజమానులు, వర్తక , వ్యాపార సంగం నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.