పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు మీకోసం. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?
వెల్లుల్లిని దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.
” అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కితే ప్రయోజనముంటుంది.
గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి నోట్లో వేసుకొని రోజూ పుక్కిలిస్తే దంతాల సమస్యలు తగ్గుతాయి.