కనీస మార్కులతో(35) ఇంటర్ పాసైనవారిని కూడా ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్ కు అర్హత లభిస్తుంది.
కరోనాతో రెండేళ్లుగా సరిగ్గా క్లాసులు జరగక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 40 మార్కులు వస్తేనే ఎంసెట్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించే వీలుంది.