Home / NATIONAL / ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

గురువారం విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ 2024 తీర్పును ప్ర‌జ‌లు 2022లోనే వెలువ‌రించిన‌ట్లు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్రముఖ ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త,ఐపాక్ అధినేత ప్ర‌శాంత్ కిషోర్ త‌ప్పుప‌ట్టారు.

ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు విడుదలైన స‌మ‌యంలో ప్ర‌ధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాల‌పై సైకాల‌జిక‌ల్ అడ్వాంటేజ్ తీసుకోవ‌డానికి చేసిన‌వేనన్నారు.  2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుంద‌ని, కానీ రాష్ట్రాల‌ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా 2024ను నిర్ణ‌యించ‌లేర‌న్నారు.

ఈ విష‌యం సాహెబ్‌కు తెలుసు అని, కానీ రాష్ట్రాల‌ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా త‌మ పార్టీ వైపు అంద‌ర్నీ మ‌ళ్లించేందుకు ప్ర‌ధాని ఓ తెలివైన ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ప్రతిప‌క్షాల‌పై నిర్ణ‌యాత్మ‌క సైకాల‌జిక‌ల్ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆరోపించారు. ప్ర‌ధాని మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌కు జ‌నం ఆక‌ర్షితులు కావొద్దు అని, త‌ప్పుదోవ ప‌ట్టించే రీతిలో ఆ వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లు ప్ర‌శాంత్ కిషోర్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri