తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మానియా స్టార్ట్ అవుతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో విపరీతంగా ప్రేక్షకులకు సినిమా విశేషాలు చేరువయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కనిపించనున్నారు. ఈనెల 25నే మూవీ రిలీజ్ అవుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందండంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. విదేశాల్లోనూ ప్రమోషన్ చేపట్టేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ సిద్ధమైంది. ప్రెస్‌మీట్లు, వివిధ భాషల్లో ప్రీరిలీజ్ ఈవెంట్లు జరగనున్నాయి.
ఈనెల 25న మూవీ రిలీజ్ అవుతుండటంతో 18 నుంచి 23 వరకు వివిధ ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. 18న దుబాయ్, 19న బెంగుళూరు, 20న ఢిల్లీ, బరోడా, 21న అమృత్‌సర్, జైపూర్, 22న కోల్‌కతా, వారణాసి, 23న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్లు జరగనున్నాయి. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాన్ని మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.