Home / SLIDER / దేశానికి కావాల్సింది క‌శ్మీర్ ఫైల్స్ కాదు.. డెవ‌ల‌ప్‌మెంట్ ఫైల్స్ -సీఎం కేసీఆర్

దేశానికి కావాల్సింది క‌శ్మీర్ ఫైల్స్ కాదు.. డెవ‌ల‌ప్‌మెంట్ ఫైల్స్ -సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్ లో గులాబీ దళపతి,సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జ‌రుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులతో సహా పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజర‌య్యారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. దేశానికి కావాల్సింది క‌హ్మీర్ ఫైల్స్ కాదు.. డెవ‌ల‌ప్‌మెంట్ ఫైల్స్ కావాల‌న్నారు. దేశంలో స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే ఈ సినిమాను విడుద‌ల చేశార‌ని మండిప‌డ్డారు.కేంద్రం క‌శ్మీర్ ఫైల్ సినిమాను వ‌దిలిపెట్టి, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో చొర‌వ చూపాల‌న్నారు.

క‌శ్మీర్‌లో హిందూ పండిట్‌ల‌ను చంపిన‌ప్పుడు బీజేపీ అధికారంలో లేదా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డానికే క‌శ్మీర్ ఫైల్ సినిమాను ముందుకు తెచ్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రం అసలు విషయాలను పక్కనపెట్టి కశ్మీర్ ఫైల్స్ ని ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే దుర్మార్గం జ‌రుగుతోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri