Home / MOVIES / రాజమౌళిపై అసంతృప్తి.. ఆ వార్తలపై అలియా క్లారిటీ!

రాజమౌళిపై అసంతృప్తి.. ఆ వార్తలపై అలియా క్లారిటీ!

RRR టీమ్‌, దర్శకుడు రాజమౌళిపై నటి అలియా భట్‌ తీవ్ర అసంతృప్తితో ఉందని.. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సినిమాకి సంబంధించిన పోస్టులను డిలీట్‌ చేసిందని ఈ మధ్య పుకార్లు షికారు చేశాయి. అలియాకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో స్క్రీన్‌ స్పేస్‌ తక్కువ ఇచ్చారని.. అందుకే ఏకంగా రాజమౌళిని అన్‌ఫాలో కూడా చేసేసిందని ఊహాగానాలు వచ్చాయి.

అయితే వీటన్నింటికీ అలియా క్లారిటీ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌, రాజమౌళిపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని.. పుకార్లను వ్యాప్తి చేయొద్దని కోరింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ లెటర్‌ను పోస్ట్‌ చేసింది. 

తాను ప్రతిసారీ పాతపోస్టులను ఫ్రొఫైల్‌ గ్రిడ్‌ నుంచి తిరిగి మారుస్తానని.. దీనిలో భాగంగానే ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టులను మార్చానని అలియా ఆ లెటర్‌లో పేర్కొన్నారు.  వీటి ఆధారంగా తప్పుడు అంచనాలు వేసి పుకార్లు ప్రచారం చేయొద్దని కోరారు. 

ఆర్‌ఆర్‌ఆర్‌లాంటి గొప్ప మూవీలో నటించినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. సీత పాత్రని ప్రేమతో చేశానన్నారు.  రాజమౌళి డైరెక్షన్‌.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అలియా పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino