Home / NATIONAL / కాంగ్రెస్‌లో కలకలం.. హాట్‌టాపిక్‌గా హార్దిక్‌ కామెంట్స్‌

కాంగ్రెస్‌లో కలకలం.. హాట్‌టాపిక్‌గా హార్దిక్‌ కామెంట్స్‌

కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే ఉన్న లుకలుకలు చాలవన్నట్లు కొత్తగా మరికొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ పార్టీ అధిష్ఠానం తీర పట్ల ఇప్పటికే విసిగిపోయిన కాంగ్రెస్‌శ్రేణులకు కొత్త తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గుజరాత్‌లో ఆ పార్టీకి ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువైంది. గుజరాత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్దిక్‌ పటేల్‌ లేటెస్ట్‌గా చేసిన కామెంట్స్‌ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతున్నాయి.

ఇటీవల ఓ నేషనల్‌ మీడియా సంస్థతో హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతూ ఏకంగా తమ అధినాయకత్వంపైనే విమర్శలు చేశారు. తనను పార్టీలో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పీసీసీ మీటింగ్‌లకు పిలవడం లేదని.. ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు తనను అడగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విషయానికీ తనను పట్టించుకోనపుడు నాకిచ్చిన పదవికి విలువేముంటుందని అధిష్ఠానాన్ని హార్దిక్‌ నిలదీశారు. గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితులపై హార్దిక్‌పటేల్‌ ఇలా ఓపెన్‌ మాట్లాడటం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat