ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అతని సోదరుడు విశ్వ ప్రసాద్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ లో కేసు నమోదైంది. నగరంలోని బంజారాహీల్స్ రోడ్ నెంబర్ పదిలో ఉన్న అర్ధ ఎకరం తమదేనంటూ ఆధీనంలో తీసుకునేందుకు దాదాపు తొంబై మంది అక్కడకు వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకెళ్లి దొరికిన అరవై మూడు మందిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈ వ్యవహారంలో ప్రయేమం ఉన్న ఎంపీ వెంకటేష్ తో సహా పదిహేను మందిపై కేసు నమోదు చేశారు.