హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల కోసం నిర్వహించిన ఆన్లైన్ వేలానికి భారీ స్పందన వచ్చింది. తమకు నచ్చిన నంబర్ కోసం భారీ మొత్తంలో వెచ్చించేందుకు వెహికల్ ఓనర్లు ఏ మాత్రం వెనుకాడలేదు.
TS 09 FV 9999 నంబర్ కోసం రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి పోటీపడి రూ.4,49,999 లక్షలు వెచ్చించి దాన్ని సొంతం చేసుకున్నారు. TS 09 FW 0001 నంబర్ కోసం శ్రీనిధి ఎస్టేట్స్ సంస్థ రూ.4లక్షలు చెల్లించి దక్కించుకుంది. TS 09 FW 0099 నంబర్‌ను బిందురెడ్డి అనే ఆమె రూ.3.7లక్షలకు కొనుగోలు చేసి తమ క్రేజ్‌ను చాటుకున్నారు.