Home / SLIDER / నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే Kp పర్యటన…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ నారాయణ రెడ్డి కాలనీ మరియు సిరి ఎంక్లేవ్ లలో స్థానిక సమస్యలపై ఈరోజ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణంను పరిశీలించారు.

వర్షాకాలం సమీపిస్తుండటంతో ఆచార్య కుంట నుండి బాటా షో రూం వరకు ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో చేపడుతున్న వర్షపు నీటి నాలా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు ఫోన్ లో సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం 13వ డివిజన్ లోని ఇందిరమ్మ కాలని ఫేస్-1 లో మంచినీటి సరఫరా ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులను ఆదేశించి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, రాఘవేంద్రరావు, నిజాంపేట్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, వెంగయ్య చౌదరి, బొర్రా చందు, ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్, సాంబశివ రెడ్డి, మహేందర్ రెడ్డి, దండుగుల స్వామి, బైండ్ల నగేష్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat