Breaking News
Home / LIFE STYLE / రోజు పుచ్చకాయ తింటే ఏమవుతుంది..?

రోజు పుచ్చకాయ తింటే ఏమవుతుంది..?

ఎండ‌కాలంలో బయటకెళ్లితే  తినడానికి గుర్తొచ్చేది పుచ్చ‌కాయ‌. ఎండ‌కాలంలో వేస‌వి తాపాన్ని, దాహార్తిని తీర్చ‌డంలో ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. పుచ్చ‌కాయ‌లో 92 శాతం నీరే ఉండ‌టం వ‌ల్ల ఎండ వేడి నుంచి శ‌రీరానికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.

శ‌రీరంలో వాట‌ర్ లెవ‌ల్స్‌తో పాటు షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గిపోకుండా ఉండేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.  మిగిలిన 8 శాతంలోనూ విట‌మిన్ ఏ, బీ1, బీ6, స‌2, పొటాషియం, మెగ్నీషియం, బ‌యోటిన్‌, కాప‌ర్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలను అందిస్తాయి.

పుచ్చ‌కాయ తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు

– పుచ్చ‌కాయ రోజూ తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

– కొన్ని ర‌కాల కేన్స‌ర్ వ్యాధుల‌ను నిరోధించే ల‌క్ష‌ణాలు కూడా ఉన్న‌ట్లు ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది.

– పుచ్చ‌కాయ‌లో ఉండే విట‌మిన్ సీ.. జుట్టును అందంగా, బ‌లంగా మారుస్తుంది.

– క‌ళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవ‌డంలో పుచ్చ‌కాయ స‌హాయ‌ప‌డుతుంది. ఇందులో ఉండే విట‌మిన్ ఏ.. క‌ళ్ల రెటీనాలో పింగ్మెంట్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. అలాగే వేస‌విలో కంటి ఇన్ఫెక్ష‌న్ల‌ను నివారిస్తుంది.

– క‌డుపుతో ఉన్న మ‌హిళ‌లు పుచ్చ‌కాయ తినడం వ‌ల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.

– కాల్షియం అధికంగా ఉండే పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, వాతం వంటి రోగాలు న‌య‌మ‌వుతాయి.

– కిడ్నీలో రాళ్లు ఉన్న‌వారు.. మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డేవారికి పుచ్చ‌కాయ ఎంతో మేలు చేస్తుంద‌ట‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino