తెలంగాణలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ (మ) సర్పంచ్ శారదా ప్రవీణ్.. సర్కారు బడులను బలోపేతం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సర్కారు బడిలో చేరే పిల్లలకు ప్రతి నెలా రూ.500 చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్థికమంత్రి హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, గ్రామస్తులు సర్పంచ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
