టీడీపీ నేత లోకేష్‌కు వైసీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. టెన్త్ విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంట్రీ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో లోకేష్ బిత్తరపోయారు.
వాళ్లను చూడగానే వెంటనే జూమ్ లైవ్‌ను కట్ చేసేశారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దొంగ ఐడీలతో తమ మీటింగ్‌ను డిస్టర్బ్ చేస్తున్నారంటూ లోకేష్ అసహనంతో వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.