ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లకు ఈడీ షాకిచ్చింది. ఈరోజు శుక్రవారం ఉదయం నాలుగంటల నుండి ఇంట్లో ఈడీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఇంటి లోపలికి రానీయకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆస్తుల వివరాలపై ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
