తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఈ నెల 24న తమ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన కార్యాలయంలో నూతన ఎంపీల చేత రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
