తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆన్లైన్లో మాంసం విక్రయాలు జరిపే ప్రముఖ ఫ్రెష్టుహోమ్ (ఎఫ్టీహెచ్).. ప్రకటించింది. ఈ క్రమంలో రాబోయే ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా చేయబోయే వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది.తాజా మాంసం, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఈ-కామర్స్ వేదికగా ఎఫ్టీహెచ్ పేరుగాంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర జనాభాలో 98 శాతానికిపైగా మంది మాంసాహార ప్రియులే. నెలకు 1.4 కిలోల తలసరి వినియోగం ఉన్నది. ఈ క్రమంలోనే తెలంగాణలో వ్యాపార కార్యకలాపాల్ని మరింతగా పెంచాలని ఫ్రెష్టుహోమ్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది.
