ఏపీలోని తిరుపతి కోర్టుకు హాజరైన ప్రముఖ సీనియర్ తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ మనిషినని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తానొకరినని వ్యాఖ్యానించారు.
తాను రియల్ హీరోనని, విద్యార్థుల కోసం పోరాడితే కేసులు పెట్టారని విమర్శించారు. 2019లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం మోహన్ బాబు ధర్నా చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. విచారణను కోర్టు వచ్చే సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది.